కంటెంట్‌కు వెళ్లు

క్రీస్తు విరోధి ఎవరు?

క్రీస్తు విరోధి ఎవరు?

బైబిలు ఇచ్చే జవాబు

 క్రీస్తు విరోధి కేవలం ఒక వ్యక్తో లేదా ఒక సంస్థో కాదు. ఎందుకంటే “అనేకులైన క్రీస్తు విరోధులు” ఉన్నారని బైబిలు చెప్తుంది. (1 యోహాను 2:18) అయితే “క్రీస్తు విరోధి” అనే గ్రీకు పదానికి “క్రీస్తు వ్యతిరేకి (లేదా క్రీస్తుకు బదులు)” అని అర్థం. క్రీస్తు విరోధులు ఏమి చేస్తారంటే:

 క్రీస్తు విరోధులు ఏమి చేస్తారో చెప్పడమే కాకుండా, అలాంటి వాళ్లందర్నీ బైబిలు “క్రీస్తు విరోధి” అని పిలుస్తోంది. (2 యోహాను 8) మొదటిసారిగా క్రీస్తు విరోధులు అపొస్తలుల కాలంలో కనిపించారు. అయితే వాళ్లు ఇప్పటివరకు చురుకుగా ఉన్నారు. ఇలా జరుగుతుందని బైబిలు ముందుగానే చెప్పింది.—1 యోహాను 4:3.

క్రీస్తు విరోధులను ఎలా గుర్తుపట్టవచ్చు?

  •   వాళ్లు యేసు గురించిన తప్పుడు బోధలను ప్రచారం చేస్తారు. (మత్తయి 24:9, 11) ఉదాహరణకు, త్రిత్వం గురించి బోధించేవాళ్లు లేదా యేసు సర్వశక్తిగల దేవుడని చెప్పేవాళ్లు “తండ్రి నాకంటె గొప్పవాడు” అని చెప్పిన యేసు బోధల్ని వ్యతిరేకిస్తున్నట్లే.—యోహాను 14:28.

  •   దేవుని రాజ్యం పనిచేసే విధానం గురించి యేసు చెప్పినదాన్ని క్రీస్తు విరోధులు ఒప్పుకోరు. ఉదాహరణకు, క్రీస్తు మానవ ప్రభుత్వాల ద్వారా పరిపాలిస్తున్నాడని కొంతమంది మతనాయకులు చెప్తారు. కానీ వాళ్లు చెప్తున్నదానికి, యేసు చెప్పినదానికి పొంతన కుదరడం లేదు. యేసు ఏమి చెప్పాడంటే, “నా రాజ్యము ఇహసంబంధమైనది కాదు.”—యోహాను 18:36.

  •   యేసు తమ ప్రభువని చెప్పుకుంటారు కానీ రాజ్యసువార్తను ప్రకటించమని యేసు ఇచ్చిన ఆజ్ఞతో సహా ఏ ఆజ్ఞనూ వాళ్లు పాటించరు.—మత్తయి 28:19, 20; లూకా 6:46; అపొస్తలుల కార్యములు 10:42.