కంటెంట్‌కు వెళ్లు

దేవుడు నిజంగా ఉన్నాడా?

దేవుడు నిజంగా ఉన్నాడా?

బైబిలు ఇచ్చే జవాబు

 ఉన్నాడు. దేవుడు ఉన్నాడని చెప్పడానికి బైబిల్లో తిరుగులేని రుజువులు ఉన్నాయి. మతాలు చెప్పేవాటిని గుడ్డిగా నమ్మమని బైబిలు చెప్పట్లేదు గానీ మంచిచెడులను వివేచించగల సామర్థ్యాన్ని ఉపయోగించి దేవునిపై విశ్వాసం పెంచుకోమని చెప్తుంది. (రోమీయులు 12:1; 1 యోహాను 5:20) బైబిలు చెప్తున్న ఈ విషయాల గురించి ఓసారి ఆలోచించండి.

  •   జీవరాశులు ఉన్న ఈ విశ్వంలో అన్నీ ఓ పద్ధతిలో ఉన్నాయంటే వీటన్నిటి వెనుక ఓ సృష్టికర్త ఉన్నాడని తెలుస్తుంది. “ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే” అని బైబిలు చెప్తుంది. (హెబ్రీయులు 3:3, 4) ఇది చిన్న విషయమే అయినా, పెద్దపెద్ద చదువులు చదివిన చాలామందిని ఈ విషయం ఆలోచనలో పడేస్తోంది. a

  •   మన జీవితానికిగల అర్థాన్ని తెలుసుకోవాలనే కోరిక మనుషులమైన మనందరిలో ఉంటుంది. ఇది, మన శరీర అవసరాలన్నీ తీరిపోయాక కూడా మిగిలిపోయే ఆకలిలాంటిది. ఆ ఆకలినే బైబిలు ‘ఆధ్యాత్మిక అవసరం’ అని పిలుస్తోంది. ఆధ్యాత్మిక అవసరం అంటే, దేవుని గురించి తెలుసుకుని ఆయన్ను ఆరాధించాలనే కోరక అన్నమాట. (మత్తయి 5:3, NW; ప్రకటన 4:10, 11) కేవలం దేవుడు ఉన్నాడు అనడానికే కాదు, ఆయన ఓ ప్రేమగల సృష్టికర్తగా మన ఆధ్యాత్మిక అవసరాల్ని తీర్చాలని కోరుకుంటున్నాడని చెప్పడానికి కూడా మనలో ఉన్న ఆ కోరికే రుజువు.—మత్తయి 4:4.

  •   బైబిల్లో ఉన్న ప్రవచనాలన్నీ కొన్ని వందల సంవత్సరాల ముందే రాశారు. అవి ఉన్నవున్నట్లుగా నిజమౌతున్నాయి. వాటిలో ఒక్క పొల్లు కూడా పోకుండా అంత ఖచ్చితంగా నెరవేరుతున్నాయంటే వాటిని రాయించింది ఓ మనిషి మాత్రం కాదని అర్థమౌతుంది.—2 పేతురు 1:21.

  •   బైబిల్ని రాసివాళ్లకు, సైన్స్‌ గురించి తమ కాలంలోని మిగతావాళ్లకన్నా చాలా ఎక్కువ విషయాలు తెలుసు. ఉదాహరణకు, ప్రాచీన కాలంలోని చాలామంది, భూమిని ఏనుగు, పంది, ఎద్దు లాంటి ఏదో జంతువు మోస్తోందని అనుకున్నారు. కానీ ‘శూన్యంపై భూమి’ వేలాడుతోందని బైబిలు చెప్తోంది. (యోబు 26:7) అదేవిధంగా భూమి ‘మండలం’ ఆకారంలో లేదా గుండ్రంగా ఉందని బైబిలు సరిగ్గా వర్ణిస్తోంది. (యెషయా 40:22) ఆ కాలంలోని ప్రజలకు తెలియని విషయాలు బైబిలు రాసినవాళ్లకు తెలిసాయంటే వాటిని దేవుడే వాళ్లకు చెప్పి ఉంటాడని చాలామంది నమ్ముతున్నారు.

  •   ఒక వ్యక్తికి కొన్ని రకాల ప్రశ్నలకు సరైన జవాబు దొరకనప్పుడు అతను దేవుడు లేడనే అభిప్రాయానికి వచ్చేస్తాడు. అలాంటి ఎన్నో కష్టమైన ప్రశ్నలకు బైబిల్లో జవాబులు ఉన్నాయి. వాటిలో కొన్నేమిటంటే, ఒకవేళ దేవునికే గనుక ఎంతో ప్రేమ, శక్తి ఉంటే లోకంలో ఇన్ని బాధలు, కష్టాలు ఎందుకు ఉన్నాయి? మతం వల్ల మంచి జరగడానికి బదులు ఎందుకు ఎక్కువగా చెడు జరుగుతోంది?—తీతు 1:16.

a ఉదాహరణకు, విశ్వం గురించి అలన్‌ సండేజ్‌ అనే ఓ ఖగోళ శాస్త్రజ్ఞుడు (astronomer) ఒకప్పుడు ఇలా చెప్పాడు, “గందరగోళంగా ఉన్న పదార్థం నుండి అన్నీ ఓ పద్ధతిలో ఉన్న విశ్వం ఎలా వచ్చిందో నాకు అంతుచిక్కడంలేదు. దీని వెనుక ఓ వ్యవస్థీకృత సూత్రం ఉండివుండాలి. నాకు దేవుడు అనే అంశమే అంతుపట్టదు, కానీ ఆయన ఉండడం వల్లే శూన్యానికి బదులు ఏదో ఒకటి ఉందేమో.”