కంటెంట్‌కు వెళ్లు

సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని అనుభవించడానికి బైబిలు నాకు సహాయం చేస్తుందా?

సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని అనుభవించడానికి బైబిలు నాకు సహాయం చేస్తుందా?

బైబిలు ఇచ్చే జవాబు

 అవును సహాయం చేస్తుంది. కుటుంబంలో సంతోషాన్ని అనుభవించడానికి లక్షలమంది స్త్రీపురుషులకు సహాయం చేసిన బైబిల్లోని జ్ఞానయుక్తమైన ఈ సలహాల్లో కొన్నిటిని గమనించండి:

  1.   మీ పెళ్లిని చట్టబద్ధం చేసుకోండి. పెళ్లిని చట్టబద్ధం చేసుకుని జీవితాంతం ఒకరితో ఒకరు కలిసి ఉండడం కుటుంబ సంతోషానికి కీలకమైన విషయం.—మత్తయి 19:4–6.

  2.   ప్రేమను, గౌరవాన్ని చూపించుకోండి. మీ భర్త/భార్య మీతో ఎలా ప్రవర్తించాలని మీరు ఇష్టపడతారో, మీ భర్త/భార్యతో మీరూ అలాగే ప్రవర్తించండి.—మత్తయి 7:12; ఎఫెసీయులు 5:25-27, 33.

  3.   కఠినంగా మాట్లాడకండి. మీ భర్త/భార్య మిమ్మల్ని నొప్పించేవిధంగా మాట్లాడినా, ప్రవర్తించినా మీరు దయగా మాట్లాడండి. (ఎఫెసీయులు 4:31, 32) సామెతలు 15:1 లో బైబిలు చెప్తున్నట్లుగా, “మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.”

  4.   ఒకరికొకరు నమ్మకంగా ఉండండి. మీ ప్రేమను, లైంగిక కోరికలను కేవలం మీ భర్త/భార్యకు మాత్రమే కేటాయించండి. (మత్తయి 5:28) బైబిలు ఇలా చెప్తుంది: “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను.”—హెబ్రీయులు 13:4.

  5.   మీ పిల్లలకు ప్రేమతో శిక్షణనివ్వండి. చూసీచూడనట్టుగా ప్రవర్తించకండి, కఠినంగా ప్రవర్తించకండి.సామెతలు 29:15; కొలస్సయులు 3:21.