కంటెంట్‌కు వెళ్లు

ప్రతీరోజు ఒక బైబిలు వచనం

ప్రతీరోజు ఒక బైబిలు వచనం

ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం అనే చిన్నపుస్తకంలో ఒక్కో రోజుకు ఒక బైబిలు వచనం ఉంటుంది, ఆ వచనానికి సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. ఇందులో ఉన్న బైబిలు అంశాలు, మీరు ప్రతీరోజును మంచి ఆలోచనలతో, ఉల్లాసంగా మొదలుపెట్టడానికి సహాయం చేస్తాయి.

దీన్ని మీరు రోజులో ఎప్పుడైనా చదువుకోవచ్చు, అయితే ఉదయమే చదివితే ప్రయోజనం ఉందని చాలామంది గమనించారు. అప్పుడు, రోజంతా వాటి గురించి ఆలోచించగలుగుతారు. ఒకవేళ మీకు కుటుంబం ఉంటే, వాళ్లతో కలిసి దీన్ని చదివితే ఇంకా ఎక్కువ ప్రయోజనం పొందుతారు.

మీరు ఈ చిన్నపుస్తకాన్ని కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ లో చదవచ్చు; లేదా దీని కాపీని PDF రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు, అందులో సంవత్సరానికి సరిపడా బైబిలు వచనాలు ఉంటాయి.