కంటెంట్‌కు వెళ్లు

వార్విక్‌ 3వ ఫోటో గ్యాలరీ (2015 జనవరి నుండి ఏప్రిల్‌ వరకు)

వార్విక్‌ 3వ ఫోటో గ్యాలరీ (2015 జనవరి నుండి ఏప్రిల్‌ వరకు)

యెహోవాసాక్షుల కొత్త ప్రధాన కార్యాలయానికి సంబంధించిన పనులు 2015 జనవరి నుండి ఏప్రిల్‌ వరకు, ఎలా జరిగాయో ఈ ఫోటో గ్యాలరీలో చూడండి.

వార్విక్‌లో భవనాల నిర్మాణం పూర్తయ్యాక ఇలా ఉంటుంది. ఎడమవైపు పైమూల నుండి సవ్యదిశలో:

  1. వాహనాల మెయింటెనెన్స్‌ భవనం

  2. సందర్శకుల కోసం పార్కింగ్‌

  3. మెయింటెనెన్స్‌ భవనం/నివాసితుల కోసం పార్కింగ్‌

  4. B నివాస భవనం

  5. D నివాస భవనం

  6. C నివాస భవనం

  7. A నివాస భవనం

  8. ఆఫీసులు/సేవలు విభాగాల భవనం

2015, జనవరి 2​—వాహనాల మెయింటెనెన్స్‌ భవనం

పరిపాలక సభలోని పబ్లిషింగ్‌ కమిటీకి సహాయకుడైన సోదరుడు హేరల్డ్‌ కార్కర్న్‌, “లివింగ్‌ అప్‌టు యువర్‌ పొటెన్షియల్‌” అనే అంశంతో బైబిలు ప్రసంగాన్ని ఇచ్చారు. వార్విక్‌ ప్రాజెక్టులో పనిచేస్తున్న వాళ్లను ప్రోత్సహించడానికి, ప్రసంగీకులు వస్తూవుంటారు.

2015, జనవరి 14​—ఆఫీసులు/సేవలు విభాగాల భవనం

భవనం చుట్టూ కట్టిన తెల్లని ప్లాస్టిక్‌ పట్టా, పనిచేసే వాళ్లకు రక్షణగా ఉంటుంది, చలికాలంలో పని పూర్తిచేయడానికి సహాయపడుతుంది. ఈ భవనంలో భోజన హాలు, వైద్యశాల, వంటగది, లాండ్రీ ఉంటాయి.

2015, జనవరి 16​—D నివాస భవనం

ఎలక్ట్రిషియన్లు వైర్లను అమర్చడానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే నివాస భవనాల్లో 12,000 మీటర్ల (40,000 అడుగుల) వైరు అమర్చారు. వార్విక్‌లో స్థలం కొన్న వెంటనే ఎలక్ట్రికల్‌ పని మొదలుపెట్టారు, ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకూ ఈ పని జరుగుతూనే ఉంటుంది.

2015, జనవరి 16​—A నివాస భవనం

బాల్కనీని వాటర్‌ప్రూఫ్‌ చేయడానికి దానికి డక్ట్‌ టేపు అంటిస్తున్న సోదరుడు. ఇక్కడ, అన్నిటికంటే పై అంతస్తు బాల్కనీలకు పాలీమిథైల్‌ మిథాక్రిలేట్‌ను పైపూతగా వేస్తున్నారు. ద్రవరూపంలో ఉన్న దీన్ని త్వరగా వేయవచ్చు. ఇది తేమ రానివ్వని పొరలా తయారౌతుంది.

2015, జనవరి 23​—A నివాస భవనం

ఎలక్ట్రికల్‌ పని చేసే ఈ తండ్రి, కూతురు నివాస భవనాల్లోని గదులకు విద్యుత్‌ సరఫరా చేసే వైర్లను అమర్చుతున్నారు.

2015, ఫిబ్రవరి 6​—వాహనాల మెయింటెనెన్స్‌ భవనం

కష్టపడి పని చేసిన వర్కర్స్‌, తాత్కాలికంగా తయారు చేసిన డైనింగ్‌ హాల్లో భోజనం చేస్తున్నారు. ప్రతిరోజూ 2,000 కన్నా ఎక్కువ మందికి భోజనం ఏర్పాటు చేస్తారు.

2015, ఫిబ్రవరి 12​—మెయింటెనెన్స్‌ భవనం/నివాసితుల కోసం పార్కింగ్‌

మెయింటెనెన్స్‌ షెడ్‌ల బేస్‌మెంట్‌ కోసం నిర్మాణ సిబ్బంది ఇనుప రాడ్‌లను అమర్చుతున్నారు.

2015, ఫిబ్రవరి 12​—C నివాస భవనం

నిర్మాణపని వాళ్లను మెచ్చుకుంటూ పిల్లలు రాసిన ఉత్తరాలు. చాలామంది వాలంటీర్లు కొంతకాలమే ఉంటారు. నిజానికి, సుమారుగా వారానికి 500 మంది కొత్త వర్కర్స్‌ వస్తూంటారు. ఫిబ్రవరి నెలలో, వార్విక్‌ ప్రాజెక్టు కోసం రోజుకు దాదాపు 2,500 మంది పనిచేశారు.

2015, ఫిబ్రవరి 24​—వార్విక్‌ స్థలం

ఇప్పటికి దాదాపు 60 శాతం ప్రాజెక్టు పూర్తయింది. 2015 జనవరి నుండి ఏప్రిల్‌ వరకు, నివాస భవనాల నిర్మాణం, ఆఫీసులు/సేవలు విభాగాల భవనపు స్టీల్‌ స్ట్రక్చర్‌ నిర్మాణం జరిగింది. ఆ నెలల్లో ఇంకా, మెయింటెనెన్స్‌ భవనం మీద కాంక్రీట్‌ పానెల్స్‌ను అమర్చడం, నివాస భవనాల్ని కలిపే కాలినడక రోడ్‌లు వేయడం, స్టెర్లింగ్‌ ఫారెస్ట్‌ సరస్సు (బ్లూ లేక్‌) మీది డ్యామ్‌ను బాగుచేయడం వంటి పనులు కూడా మొదలుపెట్టారు.

2015, ఫిబ్రవరి 25​—ఆఫీసులు/సేవలు విభాగాల భవనం

ఇది టవర్‌ కింద నుండి తీసిన ఫోటో. ఈ టవర్‌లో మెట్లు నిర్మిస్తారు. ఐదు అంతస్థుల మెట్లు ఉండే ఈ టవర్‌ కోసం ఫ్రేమ్‌లను కాంట్రాక్టర్లు నిర్మించారు, మన వాలంటీర్‌ సోదరులు వాటిలో కాంక్రీట్‌ పోశారు.

2015, ఫిబ్రవరి 26​—మెయింటెనెన్స్‌ భవనం/నివాసితుల కోసం పార్కింగ్‌

మంచు కురుస్తున్న ఓ రోజు, నిర్మాణ సిబ్బంది మొదటి అంతస్తు కోసం ఇనుప రాడ్‌లు అమర్చుతున్నారు. జనవరి, మార్చి మధ్య కాలంలో, వార్విక్‌ స్థలంలో దాదాపు 127 సెంటీమీటర్ల (50 అంగుళాల) మంచు కురిసింది. మంచు తొలగించే సిబ్బంది, పని జరిగే స్థలాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవారు, వేడిగా ఉండే చిన్న గదుల్లో వర్కర్స్‌ చలి కాచుకునేవాళ్లు.

2015, మార్చి 12​—సందర్శకుల కోసం పార్కింగ్‌

పైకప్పు కోసం అమర్చిన ట్రస్సుల మీద మెటల్‌ రేకులు బిగిస్తున్నారు. ఏప్రిల్‌ నెలాఖరుకల్లా నివాస భవనాల మీద త్రికోణాకార పైకప్పుల నిర్మాణం చాలావరకు పూర్తౌతుంది. చివరిగా, B నివాస భవనం మీది పైకప్పులు నిర్మించడంతో, జూన్‌ నెల రెండో వారానికల్లా పైకప్పుల నిర్మాణం పూర్తౌతుంది.

2015, మార్చి 18​—మెయింటెనెన్స్‌ భవనం/నివాసితుల కోసం పార్కింగ్‌

ఒక టవర్‌ క్రేన్‌లో నుండి B నివాస భవనం కనిపిస్తున్న దృశ్యం

2015, మార్చి 18​—మెయింటెనెన్స్‌ భవనం/నివాసితుల కోసం పార్కింగ్‌

నివాసితుల పార్కింగ్‌ ప్రదేశంలో, ప్లంబింగ్‌ పనివాళ్లు ప్లాన్‌లను పరిశీలిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు కోసం అనుమతి పొందిన 3,400 కంటే ఎక్కువ నిర్మాణ ప్లాన్‌లు అవసరమయ్యాయి.

2015, మార్చి 23​—ఆఫీసులు/సేవలు విభాగాల భవనం

భవన రక్షణ కోసం ఒక బూమ్‌ లిఫ్ట్‌ సాయంతో ప్లాస్టిక్‌ పట్టా కడుతున్న వర్కర్స్‌. లిఫ్ట్‌లు, మరితర పరికరాలు వాడేవాళ్లు వాటిని సురక్షితంగా ఆపరేట్‌ చేయడానికి ఎన్నో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. భద్రత గురించి జరిగే క్లాసుల్లో బూమ్‌ లిఫ్ట్‌లు, సిజర్‌ లిఫ్ట్‌లు ఎలా ఉపయోగించాలి, ఎత్తులో నుండి పడిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిర్మాణ స్థలంలో ఎలా మెలగాలి, శ్వాస పరికరాన్ని ఎలా ఉపయోగించాలి, క్రేన్‌ల దగ్గర ఎలా ఉండాలి, సంజ్ఞలతో ఎలా సంభాషించాలి వంటి విషయాలు చర్చిస్తారు.

2015, మార్చి 30​—వార్విక్‌ స్థలం

పడమర వైపు, నివాస భవనాలు కనిపిస్తున్న దృశ్యం. ఏప్రిల్‌ నెలాఖరులో, ఈ ఫోటోలో కనిపిస్తున్న A, B, D నివాస భవనాల్లో మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ పరికరాలను అమర్చే పని ముమ్మరంగా జరుగుతోంది. C నివాస భవనంలో (ఈ ఫోటోలో కనిపించడం లేదు) లోపలి గోడలు, టైల్స్‌, పెయింటింగ్‌ పనులు మొదలయ్యాయి.

2015, ఏప్రిల్‌ 15​—B నివాస భవనం

బూమ్‌ లిఫ్ట్‌ మీద ఉండి, బయటి గోడలకు పెయింట్‌ (వేపర్‌-పర్మియబుల్‌ ఎయి బారియర్‌) వేస్తున్న ఇద్దరు వర్కర్స్‌. ఒక్కో నివాస భవనానికి ఈ పెయింట్‌ వేయడానికి దాదాపు రెండు నెలలు పడుతుంది.

2015, ఏప్రిల్‌ 27​—ఆఫీసులు/సేవలు విభాగాల భవనం

తాపీ పనివాళ్లు గ్రానైట్‌ గోడ కడుతున్నారు. భవనంలోని ఈ భాగంలో రిసీవింగ్‌ డాక్‌, మరితర విభాగాలు ఉంటాయి.

2015, ఏప్రిల్‌ 30​—వార్విక్‌ స్థలం

బయట నుండి వచ్చిన గజ ఈతగాడు బ్లూ లేక్‌లోని పాత వాల్వ్‌ని తీసేసి కొత్త వాల్వ్‌ని బిగిస్తున్నాడు. తుఫాను సమయంలో వరద ముంచెత్తకుండా ఉండడానికి, ఒక్క బటన్‌ నొక్కి సరస్సులో నీటి మట్టం తగ్గించవచ్చు.