కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షుల మతశాఖ అమెరికాకు చెందిందా?

యెహోవాసాక్షుల మతశాఖ అమెరికాకు చెందిందా?

 మా ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. కానీ మాది అమెరికాకు చెందిన మతశాఖ కాదు. దానికి కారణాలు ఇవి:

  •   స్థాపిత మతం నుండి వేరుపడిన గుంపును శాఖ అని కొందరంటారు. యెహోవాసాక్షులు ఇతర మతాల గుంపు నుండి వేరుపడిన వాళ్లు కాదు. కానీ, మొదటి శతాబ్దంలో పాటించిన క్రైస్తవ మతాన్ని మేము పునఃస్థాపించామని భావిస్తున్నాం.

  •   యెహోవాసాక్షులు తమ పరిచర్యను 230 కన్నా ఎక్కువ దేశాల్లో, ప్రాంతాల్లో చురుగ్గా చేస్తున్నారు. మేము ఎక్కడ నివసిస్తున్నా యెహోవా దేవునికి, యేసుక్రీస్తుకు కట్టుబడి ఉండడానికి ప్రాధాన్యతనిస్తాం కానీ అమెరికా ప్రభుత్వానికో లేదా వేరే ఏ మానవ ప్రభుత్వానికో కాదు.—యోహాను 15:19; 17:15, 16.

  •   మా బోధలన్నీ బైబిలు మీద ఆధారపడినవి, అమెరికాలోని కొంతమంది మత గురువులు రాసిన వాటి మీద ఆధారపడినవి కాదు.​—1 థెస్సలొనీకయులు 2:13.

  •   మేము యేసుక్రీస్తును అనుసరిస్తాం కానీ, మానవ గురువునో కాదు.—మత్తయి 23:8-10.