కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజమైన స్నేహితులను ఎలా సంపాదించుకోవచ్చు?

నిజమైన స్నేహితులను ఎలా సంపాదించుకోవచ్చు?

మన యువతకు

నిజమైన స్నేహితులను ఎలా సంపాదించుకోవచ్చు?

సూచనలు: ప్రశాంతంగా ఉండే పరిసరాల్లో కూర్చుని ఈ బైబిలు వచనాలను చదవండి. అలా చదువుతున్నప్పుడు ఆ వృత్తాంతాల్లోని వ్యక్తుల మధ్య మీరూ ఉన్నట్లు, అందులోని సంఘటనలను కళ్లారా చూస్తున్నట్లు, వారి మాటలు వింటున్నట్లు, ఆ వృత్తాంతాలు మీ ఎదుటే జరుగుతున్నట్లు ఊహించుకోండి. అందులోని ప్రధాన పాత్రల భావాలు ఎలా ఉండివుంటాయో ఆలోచించండి.

ముఖ్య పాత్రలు: యోనాతాను, దావీదు, సౌలు

సారాంశం: దావీదు గొల్యాతును చంపిన తర్వాత, యోనాతాను దావీదుకు మంచి స్నేహితుడయ్యాడు.

1 సన్నివేశాన్ని విశ్లేషించండి.— 1 సమూయేలు 17:57–18:11; 19:1; 20:1-17, 41, 42 చదవండి.

సౌలు రూపం ఎలా ఉన్నట్లు మీరు ఊహించుకున్నారో వర్ణించండి. (క్లూ: 1 సమూయేలు 10:20-23 చూడండి.)

_______

దావీదు యోనాతానును కలిసే సమయానికి దావీదు యౌవనస్థుడై ఉండవచ్చు. దావీదు చూడ్డానికి ఎలా ఉండివుంటాడని మీరు ఊహించుకున్నారు? (క్లూ: 1 సమూయేలు 16:12, 13 చూడండి.)

_______

1 సమూయేలు 20వ అధ్యాయం చివర్లో దావీదు, యోనాతాను విడిపోతున్నప్పుడు వాళ్ల స్వరంలో ఎలాంటి భావాలు వినిపించివుంటాయి?

_______

2 మరింత పరిశోధన చేయండి.

ఆ వృత్తాంతంలో ఇంకా ఇలా ఉంది, “యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను” అంటే వాళ్లిద్దరూ ‘ప్రాణ స్నేహితులయ్యారు.’ (1 సమూయేలు 18:1) యోనాతాను దావీదును ఇష్టపడేంతగా యోనాతాను ఆయనలో ఏ లక్షణాలు చూసివుంటాడు? (క్లూ: 1 సమూయేలు 17:45, 46 చూడండి.)

_______

దావీదుకన్నా యోనాతాను దాదాపు 30 సంవత్సరాలు పెద్దవాడు. వాళ్లిద్దరి మధ్య అంత వయసు తేడా ఉన్నా, వాళ్లు ‘ప్రాణస్నేహితులు’ అవడానికి ఏ విషయాలు దోహదపడివుంటాయి?

_______

ఆసక్తికరమైన ఈ వృత్తాంతం చూపిస్తున్నట్లు నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలి? (క్లూ: సామెతలు 17:17; 18:24 చూడండి.)

_______

యోనాతాను తన తండ్రికి నమ్మకంగా ఉండడం కంటే దావీదుకు ఎందుకు ఎక్కువ నమ్మకంగా ఉన్నాడు?

_______

3 మీరు నేర్చుకున్న విషయాలను అన్వయించుకోండి. మీరు ఈ క్రింది విషయాల గురించి ఏమి నేర్చుకున్నారో రాయండి . . .

స్నేహం.

_______

నమ్మకంగా ఉండడం.

_______

పెద్దవాళ్లతో స్నేహాలు.

_______

ఎవరైనా మీకు ప్రాణస్నేహితులు కావాలంటే మీరు ఏమి చేయాలి?

_______

4 ఈ వృత్తాంతంలో ఏది మీ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనదని మీకు అనిపించింది, ఎందుకు?

_______

(w10-E 07/01)

మీ దగ్గర బైబిలు లేకపోతే, యెహోవాసాక్షులను అడగండి లేదా www.watchtower.org వెబ్‌సైట్‌లో, ఎంపిక చేయబడిన భాషల్లో బైబిలు అందుబాటులో ఉంది, మీరు అందులో చదువుకోవచ్చు