కంటెంట్‌కు వెళ్లు

బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?

బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?

మీ అభిప్రాయం ఏంటి?

  • వస్తుంది.

  • రాదు.

  • చెప్పలేం.

ఒక ప్రాచీన గ్రంథంలో ఇలా ఉంది:

‘దేవుడు వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు.’—ప్రకటన 21:3, 4, కొత్త లోక అనువాదం.

దానివల్ల మీరు పొందేవి

దేవుడు బాధలుపెట్టడు అనే నమ్మకం.—యాకోబు 1:13.

మన బాధను దేవుడు అర్థం చేసుకుంటాడనే ఊరట.—జెకర్యా 2:8.

బాధలు లేని కాలం తప్పకుండా వస్తుందనే ఆశ.—కీర్తన 37:9-11.

ఆ మాటలు ఎందుకు నమ్మవచ్చు?

రెండు కారణాలు పరిశీలించండి.

  • బాధలు, అన్యాయం దేవునికి అస్సలు ఇష్టంలేదు. గతంలో తన ప్రజలు తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు యెహోవా దేవునికి ఎలా అనిపించిందో పరిశీలించండి. శత్రువులు తన ప్రజలతో ‘క్రూరంగా ప్రవర్తించడం’ చూసి యెహోవా ఎంతో బాధపడ్డాడని ఆ ప్రాచీన గ్రంథం చెప్తుంది.—న్యాయాధిపతులు 2:18.

    వేరేవాళ్లకు హాని చేసేవాళ్లను యెహోవా అసహ్యించుకుంటాడు. ఉదాహరణకు, “అమాయకుల రక్తం చిందించే చేతులు” యెహోవాకు అసహ్యమని ఆ గ్రంథం చెప్తుంది.—సామెతలు 6:16, 17.

  • దేవునికి మనలో ప్రతీ ఒక్కరి మీద శ్రద్ధ ఉంది. ఒక వ్యక్తి పడే “వేదన, బాధ” అతనికే కాదు యెహోవాకు కూడా తెలుసు!2 దినవృత్తాంతాలు 6:29, 30.

    త్వరలోనే, యెహోవా తన పరిపాలన ద్వారా ప్రతీ ఒక్కరి బాధల్ని తీసేస్తాడు. (మత్తయి 6:9, 10) ఈలోగా, తన సహాయం అడిగేవాళ్లను ఆయన ప్రేమతో ఓదారుస్తాడు.—అపొస్తలుల కార్యాలు 17:27; 2 కొరింథీయులు 1:3, 4.

ఈ ప్రశ్న గురించి ఆలోచించండి . . .

దేవుడు బాధల్ని ఇంకా ఎందుకు తీసేయట్లేదు?

రోమీయులు 5:12; 2 పేతురు 3:9 లో దానికి జవాబు ఉంది.