యోబు 25:1-6

  • బిల్దదు మూడోసారి మాట్లాడడం (1-6)

    • ‘మనిషి దేవుని ముందు నిర్దోషిగా ఎలా ఉండగలడు?’ (4)

    • మనిషి యథార్థత వ్యర్థమని చెప్పాడు (5, 6)

25  అప్పుడు షూహీయుడైన బిల్దదు+ ఇలా అన్నాడు:   “రాజ్యాధికారం, భీకర శక్తి ఆయన సొంతం;పరలోకంలో* ఆయన శాంతిని స్థాపిస్తాడు.   ఆయన సైన్యాల్ని లెక్కపెట్టడం సాధ్యమా? ఆయన వెలుగు ఎవరి మీదైనా ప్రకాశించకుండా ఉంటుందా?   అలాంటిది, మామూలు మనిషి దేవుని ముందు నీతిమంతుడిగా ఎలా ఉండగలడు?+స్త్రీకి పుట్టినవాడు నిర్దోషిగా* ఎలా ఉండగలడు?+   ఆయన దృష్టికి చంద్రుడు ప్రకాశవంతంగా లేడు,నక్షత్రాలు పవిత్రంగా లేవు,   అలాంటప్పుడు, పురుగు లాంటి మనిషి,కీటకం లాంటి మనిషి ఆయన దృష్టికి ఎలా పవిత్రుడిగా ఉండగలడు?”

అధస్సూచీలు

అక్ష., “తన ఎత్తైన స్థలాల్లో.”
లేదా “స్వచ్ఛంగా.”