కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

69వ పాట

రాజ్యం గురించి ప్రకటిస్తూ ఉండండి!

రాజ్యం గురించి ప్రకటిస్తూ ఉండండి!

(2 తిమోతి 4:5)

  1. 1. రాజ్యసువార్త ప్రకటిస్తూ

    సాగిపోదాం ముందుకు.

    సాత్వికులకు సాయం చేద్దాం

    స్వీకరించేలా సత్యం.

    దేవుని సేవెంతో అమూల్యం;

    సంతోషంగా ప్రకటిద్దాం.

    దేవుని వాక్యాన్ని, పేరును

    చాటిచెప్దాం అందరికీ.

    (పల్లవి)

    చేద్దాం మనం సువార్త పనిని

    ఎంతో ధైర్యంగా.

    సాగిపోదాం, నమ్మకంగా ఉంటూ

    యెహోవా వైపు.

  2. 2. గొప్ప సమూహం, చిన్నమంద

    కలిసి సాగుతారు.

    స్త్రీలు, వృద్ధులు, యౌవనులు

    ఉన్నారు ఈ బాటలో.

    రానున్న దేవుని రాజ్యాన్ని

    గూర్చి వినాలి అందరూ.

    యెహోవా ఇస్తాడు శక్తిని,

    ఎదురులేదు మనకు.

    (పల్లవి)

    చేద్దాం మనం సువార్త పనిని

    ఎంతో ధైర్యంగా.

    సాగిపోదాం, నమ్మకంగా ఉంటూ

    యెహోవా వైపు.