కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సృష్టిలో అద్భుతాలు

సముద్రపు జంగుపిల్లి బొచ్చు

సముద్రపు జంగుపిల్లి బొచ్చు

చల్లటి నీళ్లలో ఉండే పాలు ఇచ్చే చాలా జీవులకు వాటి చర్మం కింద ఉన్న లావు కొవ్వు పొర వెచ్చదనాన్ని ఇస్తుంది. కానీ సముద్రపు జంగుపిల్లికి (sea otter) ఒత్తుగా ఉండే బొచ్చు వెచ్చదనాన్ని ఇస్తుంది.

ఆలోచించండి: పాలు ఇచ్చే మిగతా జంతువుల కన్నా సముద్ర జంగుపిల్లి బొచ్చు చాలా ఒత్తుగా ఉంటుంది. దాని చర్మంలో ప్రతి చదరపు అంగుళానికి దాదాపు 10 లక్షల వెంట్రుకలు ఉంటాయి (1,55,000 per sq cm). ఆ పిల్లి ఈత కొడుతున్నప్పుడు దాని బొచ్చు శరీరానికి దగ్గరగా గాలిని పట్టి ఉంచుతుంది. ఆ గాలి ఒక పొరలా వెచ్చదనాన్ని కాపాడుతూ, చల్లని నీళ్లు ఆ జంతువు చర్మానికి తగలకుండా, దాని ఒంట్లో వేడిని బయటకు పోనివ్వకుండా ఆపుతుంది.

సముద్రపు జంగుపిల్లి బొచ్చు నుండి నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉందని సైన్‌టిస్టులు నమ్ముతున్నారు. కృత్రిమంగా తయారు చేసిన ఎన్నో కోటులతో (artificial fur coats) వాళ్లు ప్రయోగాలు చేశారు. వెంట్రుకల పొడవు, వాటి మధ్య ఉన్న ఖాళీ వేరువేరుగా ఉన్న కోటులతో వాళ్లు ప్రయోగాలు చేశారు. పరిశోధకులు చివరికి ఇలా చెప్తున్నారు: “బొచ్చు ఎంత ఒత్తుగా, పొడవుగా ఉంటే అది అంత పొడిగా తడి పీల్చకుండా ఉంటుంది.” సముద్రపు జంగుపిల్లి దానికున్న శక్తివంతమైన బొచ్చును బట్టి ఎంతో గర్వపడవచ్చు.

పరిశోధకులు వాళ్లు చేసే అధ్యయనాల వల్ల నీటిని పీల్చకుండా ఉండే కొత్త తరహా బట్టల్ని తయారు చేసి ఉత్పత్తి చేసే విషయంలో సాంకేతికంగా అభివృద్ధి జరగుతుందని ఆశిస్తున్నారు. దీనిని చూసి కొంతమంది చల్లటి నీళ్లలోకి వెళ్లేటప్పుడు తడి పీల్చకుండా ఈ సముద్రపు జంగుపిల్లిలా ఒత్తుగా బొచ్చుతో ఉన్న దుస్తుల్ని వేసుకుంటే బాగుంటుందేమో అని అనుకున్నా అనుకోవచ్చు.

మీరేమంటారు? వేడిని కాపాడే సముద్రపు జంగుపిల్లి బొచ్చు దానికదే వచ్చేసిందా? లేదా ఎవరైనా దాన్ని అలా చేశారా?