కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

8వ పాఠం

మీరు యెహోవాకు స్నేహితులు అవ్వవచ్చు

మీరు యెహోవాకు స్నేహితులు అవ్వవచ్చు

మీరు తన గురించి ఎక్కువ తెలుసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఎందుకు? ఎందుకంటే, ఆయన గురించి ఎక్కువ తెలుసుకునే కొద్దీ ఆయనకు స్నేహితులు అవ్వాలనే కోరిక మీలో పెరుగుతుంది. కానీ దేవునికి స్నేహితులు అవ్వడం జరిగే పనేనా? (కీర్తన 25:14 చదవండి.) ఆయనకు మీరు ఎలా స్నేహితులు అవ్వవచ్చు? యెహోవా కన్నా మంచి స్నేహితులు ఇంకెవరూ ఉండరు అని ఎందుకు చెప్పవచ్చు? ఆ ప్రశ్నలకు బైబిలు జవాబిస్తుంది.

1. యెహోవా మిమ్మల్ని ఏమని ఆహ్వానిస్తున్నాడు?

“దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు.” (యాకోబు 4:8) అంటే తనకు స్నేహితులవ్వమని యెహోవా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ‘దేవుణ్ణి చూడలేం కదా, ఆయనకు ఎలా స్నేహితులం అవుతాం?’ అని కొంతమంది అనుకోవచ్చు. కానీ, మనం తన స్నేహితులు అవ్వడం కోసం యెహోవా తన గురించి బైబిల్లో చాలా వివరాలు రాయించాడు. కాబట్టి మనం ఆయన్ని ఎన్నడూ చూడకపోయినా, బైబిలు చదివి ఆయనకు స్నేహితులం అవ్వవచ్చు.

2. యెహోవా కన్నా మంచి స్నేహితులు ఇంకెవరూ ఉండరు అని ఎందుకు చెప్పవచ్చు?

యెహోవా మిమ్మల్ని ప్రేమించినంతగా ఇంకెవరూ ప్రేమించరు. మీరు సంతోషంగా ఉండాలని, ఎప్పుడు సహాయం కావాలన్నా తనను అడగాలని ఆయన కోరుకుంటున్నాడు. ‘ఆయనకు మీ మీద శ్రద్ధ ఉంది కాబట్టి మీ ఆందోళనంతా ఆయన మీద వేయవచ్చు.’ (1 పేతురు 5:7) తన స్నేహితులకు సహాయం చేయడానికి, వాళ్లను ఓదార్చడానికి, వాళ్లు చెప్పేది వినడానికి యెహోవా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.—కీర్తన 94:18, 19 చదవండి.

3. తన స్నేహితులు ఏం చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు?

యెహోవా అందర్నీ ప్రేమిస్తాడు, అయితే ముఖ్యంగా “నిజాయితీపరులకు ఆయన దగ్గరి స్నేహితుడు.” (సామెతలు 3:32) ఏది మంచో, ఏది చెడో యెహోవా చెప్తున్నాడు. తన స్నేహితులు మంచి పనులు చేయాలని, చెడ్డ పనులకు దూరంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలా ఉండడం చాలా కష్టమని కొంతమంది అనుకోవచ్చు. కానీ, యెహోవాది పెద్ద మనసు. ఎవరైతే ఆయన్ని నిజంగా ప్రేమిస్తారో, ఆయన్ని సంతోషపెట్టడానికి చేయగలిగినదంతా చేస్తారో వాళ్లందర్నీ ఆయన ఇష్టపడతాడు.—కీర్తన 147:11; అపొస్తలుల కార్యాలు 10:34, 35.

ఎక్కువ తెలుసుకోండి

మీరు యెహోవాకు ఎలా స్నేహితులు అవ్వవచ్చో, యెహోవా కన్నా మంచి స్నేహితులు ఇంకెవరూ ఉండరు అని ఎందుకు చెప్పవచ్చో వివరంగా తెలుసుకోండి.

4. అబ్రాహాము యెహోవాకు స్నేహితుడు

అబ్రాహాము (లేదా అబ్రాము) అనే వ్యక్తి గురించి బైబిలు మాట్లాడుతుంది. ఆయన గురించి చదివితే, దేవునికి స్నేహితులుగా ఉండడం అంటే ఏంటో కొంతవరకు అర్థమౌతుంది. ఆదికాండం 12:1-4లో అబ్రాహాము గురించి చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • యెహోవా అబ్రాహామును ఏం చేయమన్నాడు?

  • యెహోవా ఆయనకు ఏమని మాటిచ్చాడు?

  • అప్పుడు అబ్రాహాము ఏం చేశాడు?

5. యెహోవా తన స్నేహితుల నుండి ఏం కోరుతున్నాడు?

సాధారణంగా స్నేహితుల నుండి మనం కొన్ని విషయాలు ఆశిస్తాం.

  • మీ స్నేహితుల నుండి మీరేం ఆశిస్తారు?

1 యోహాను 5:3 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • తన స్నేహితులు ఏం చేయాలని యెహోవా కోరుతున్నాడు?

యెహోవాకు లోబడాలంటే, ఆయన ఆజ్ఞలకు తగ్గట్టు మన ప్రవర్తనను లేదా స్వభావాన్ని మార్చుకోవాల్సి రావచ్చు. యెషయా 48:17, 18 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • తన స్నేహితులు తన ఆజ్ఞల్ని పాటించాలని యెహోవా ఎందుకు కోరుతున్నాడు?

మంచి స్నేహితుడు మన ప్రయోజనం కోసమే కొన్ని జాగ్రత్తలు చెప్తాడు, యెహోవా కూడా అంతే

6. యెహోవా తన స్నేహితులకు సహాయం చేస్తాడు

యెహోవా తన స్నేహితులకు సమస్యల్ని తట్టుకునేలా సహాయం చేస్తాడు. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • వీడియోలో చూసినట్టు, నిరుత్సాహంలో ఉన్న ఒకామెకు యెహోవా ఎలా సహాయం చేశాడు?

యెషయా 41:10, 13 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • యెహోవా తన స్నేహితులందరికీ ఏమని మాటిస్తున్నాడు?

  • యెహోవా మీకు ఒక మంచి స్నేహితుడిగా ఉండగలడని మీరు అనుకుంటున్నారా? ఎందుకు?

అవసరంలో ఉన్నప్పుడు ప్రాణ స్నేహితుడు సహాయం చేస్తాడు, యెహోవా కూడా అంతే

7. యెహోవాకు స్నేహితులు అవ్వాలంటే ఆయనతో మాట్లాడాలి, ఆయన చెప్పేది వినాలి

స్నేహితులు మాట్లాడుకునే కొద్దీ ఒకరికొకరు ఇంకా దగ్గరౌతారు. కీర్తన 86:6, 11 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • మనం యెహోవాతో ఎలా మాట్లాడవచ్చు?

  • యెహోవా మనతో ఎలా మాట్లాడతాడు?

మనం ప్రార్థన ద్వారా యెహోవాతో మాట్లాడతాం, ఆయన బైబిలు ద్వారా మనతో మాట్లాడతాడు

కొంతమంది ఇలా అంటారు: “దేవునికి స్నేహితులు అవ్వడం అసాధ్యం.”

  • యెహోవాకు స్నేహితులు అవ్వడం సాధ్యమే అని చెప్పడానికి మీరు బైబిల్లో ఏ వచనం చూపిస్తారు?

ఒక్కమాటలో

యెహోవా మీతో స్నేహం చేయాలని కోరుకుంటున్నాడు, మీరు తనకు దగ్గరవ్వడానికి ఆయన సహాయం చేస్తాడు.

మీరేం నేర్చుకున్నారు?

  • యెహోవా తన స్నేహితులకు ఎలా సహాయం చేస్తాడు?

  • తన ఆజ్ఞల్ని పాటించమని యెహోవా తన స్నేహితులకు ఎందుకు చెప్తున్నాడు?

  • యెహోవా ఆజ్ఞల్ని పాటించడం చాలా కష్టమని మీకు అనిపిస్తుందా? ఎందుకు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

యెహోవాతో స్నేహం చేయడం వల్ల మీరు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?

“యెహోవా తెలుసుకోదగిన దేవుడు” (కావలికోట, ఫిబ్రవరి 15, 2003)

యెహోవాతో స్నేహం ఒకామె జీవితాన్ని ఎలా మార్చిందో తెలుసుకోండి.

“నాకు చనిపోవాలని లేదు” (కావలికోట నం. 1 2017)

యెహోవా గురించి కొంతమంది టీనేజర్లు ఏమంటున్నారో వినండి.

దేవునికి స్నేహితులుగా ఉండడం అంటే ఏంటి? (1:46)