కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

29వ పాఠం

చనిపోయాక ఏమౌతుంది?

చనిపోయాక ఏమౌతుంది?

మీ కుటుంబ సభ్యుల్లో లేదా స్నేహితుల్లో ఎవరైనా చనిపోయినప్పుడు, మీరు చాలా బాధపడి ఉంటారు. బహుశా మీకు ఈ ప్రశ్నలు వచ్చి ఉంటాయి: ‘చనిపోయాక ఏమౌతుంది? చనిపోయిన మనవాళ్లను మళ్లీ ఎప్పటికైనా చూస్తామా?’ ఈ పాఠంలో, అలాగే తర్వాతి పాఠంలో ఓదార్పునిచ్చే బైబిలు జవాబులు తెలుసుకోండి.

1. చనిపోయాక ఏమౌతుంది?

మరణాన్ని యేసు నిద్రతో పోల్చాడు. ఎందుకు? గాఢనిద్రలో ఉన్న వ్యక్తికి తన చుట్టూ ఏం జరుగుతుందో తెలీదు. అదేవిధంగా, చనిపోయిన వ్యక్తికి తన చుట్టూ ఏం జరుగుతుందో తెలీదు. అతనికి ఎలాంటి నొప్పి, బాధ ఉండవు. అసలు “చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు” అని బైబిలు చెప్తుంది.—ప్రసంగి 9:5 చదవండి.

2. మరణం గురించి నిజం తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి?

చాలామంది మరణం అంటే భయపడతారు, ఆఖరికి చనిపోయినవాళ్లకు కూడా భయపడతారు! కానీ, మరణం గురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకుంటే మీ భయాల్ని తీసేసుకోవచ్చు. “సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది” అని యేసు అన్నాడు. (యోహాను 8:32, అధస్సూచి) మనిషి చనిపోయాక అతనిలో ఆత్మ బ్రతికే ఉంటుందని కొన్ని మతాలు చెప్తున్నాయి. కానీ, బైబిలు అలా చెప్పట్లేదు. చనిపోయినవాళ్లు ఎలాంటి బాధ అనుభవించరని, వాళ్లకు ఏమీ తెలీదని, వాళ్లు మనకు హాని చేయలేరని బైబిలు చెప్తుంది. కాబట్టి చనిపోయినవాళ్లను శాంతింప చేయాల్సిన, వాళ్లను ఆరాధించాల్సిన, వాళ్ల కోసం పూజలు చేయాల్సిన అవసరం లేదు.

తాము చనిపోయినవాళ్లతో మాట్లాడగలం అని కొంతమంది చెప్పుకుంటారు. కానీ అదెలా సాధ్యం? మనం ఇంతకుముందే నేర్చుకున్నట్లుగా, “చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు.” చనిపోయిన తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడుతున్నాం అని అనుకునేవాళ్లు నిజానికి మాట్లాడుతున్నది, చనిపోయినవాళ్లలా నటిస్తున్న చెడ్డదూతలతో కావచ్చు. కాబట్టి, మరణం గురించి నిజం తెలుసుకుంటే చెడ్డదూతల నుండి మనల్ని మనం కాపాడుకుంటాం. చెడ్డదూతలతో మాట్లాడడం ప్రమాదకరమని యెహోవాకు తెలుసు, అందుకే చనిపోయినవాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించవద్దు అని మనల్ని హెచ్చరిస్తున్నాడు.—ద్వితీయోపదేశకాండం 18:10-12 చదవండి.

ఎక్కువ తెలుసుకోండి

మరణం గురించి బైబిలు ఇంకా ఏం చెప్తుంది? ప్రేమగల దేవుడు చనిపోయినవాళ్లను చిత్రహింసలు పెడతాడా? ఇప్పుడు చూద్దాం.

3. చనిపోయాక నిజంగా ఏమౌతుందో తెలుసుకోండి

చనిపోయాక ఏమౌతుంది అనేదాని గురించి ప్రపంచంలో చాలామందికి రకరకాల నమ్మకాలు ఉన్నాయి. అయితే వాటిలో అన్నీ నిజం కాకపోవచ్చు.

  • సాధారణంగా మీ ప్రాంతంలోని వాళ్లు, చనిపోయాక ఏమౌతుందని నమ్ముతారు?

బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోవడానికి, వీడియో చూడండి.

ప్రసంగి 3:20 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • ఒక వ్యక్తి చనిపోయాక ఏమౌతుంది?

  • ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా అతనిలో ఇంకా ఏదైనా బ్రతికే ఉంటుందా?

యేసు దగ్గరి స్నేహితుడైన లాజరు మరణం గురించి బైబిలు చెప్తుంది. యోహాను 11:11-14 చదవండి. ఆ వచనాలు చదువుతున్నప్పుడు, లాజరు గురించి యేసు ఏం అన్నాడో గమనించండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • మరణాన్ని యేసు దేనితో పోల్చాడు?

  • ఈ పోలికను బట్టి, చనిపోయాక ఏమౌతుందని చెప్పవచ్చు?

  • మరణం గురించి బైబిలు చెప్పేది సరైనదే అని మీకు అనిపిస్తుందా?

4. మరణం గురించి నిజం తెలుసుకుంటే మనం విడుదల పొందుతాం

మరణం గురించి నిజం తెలుసుకోవడం వల్ల మనం చనిపోయినవాళ్లకు భయపడం. ప్రసంగి 9:10 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • చనిపోయినవాళ్లు మనకు హాని చేయగలరా?

అంతేకాదు, బైబిలు ఏం చెప్తుందో తెలుసుకుంటే చనిపోయినవాళ్లను శాంతింప చేయాలి, వాళ్లను ఆరాధించాలి అనే తప్పుడు నమ్మకాల నుండి బయటపడవచ్చు. యెషయా 8:19; ప్రకటన 4:11 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • చనిపోయినవాళ్ల దగ్గర విచారణ చేస్తే లేదా వాళ్లను ఆరాధిస్తే యెహోవాకు ఎలా అనిపిస్తుంది?

మరణం గురించి నిజం తెలుసుకుంటే, యెహోవాకు ఇష్టంలేని ఆచారాల నుండి బయటపడతాం

5. మరణం గురించి నిజం తెలుసుకుంటే మనం ఓదార్పు పొందుతాం

చాలామంది తాము చేసిన తప్పులకు, చనిపోయిన తర్వాత శిక్ష అనుభవిస్తాం అని నమ్ముతున్నారు. కానీ, చనిపోయాక ఎవ్వరూ చిత్రహింసలు అనుభవించరు అని తెలుసుకోవడం మనకు ఓదార్పునిస్తుంది. పెద్దపెద్ద తప్పులు చేసిన వాళ్లయినా సరే, చనిపోయాక బాధలుపడరు. రోమీయులు 6:7 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • చనిపోయిన వ్యక్తి తన పాపం నుండి విడుదల పొందాడని ఈ వచనం చెప్తుంది, కాబట్టి అతను తన తప్పులకు చనిపోయిన తర్వాత శిక్ష అనుభవిస్తాడా?

మీరు యెహోవా లక్షణాల గురించి తెలుసుకునే కొద్దీ, చనిపోయినవాళ్లను ఆయన ఎన్నడూ చిత్రహింసలు పెట్టడని ఇంకా ఎక్కువగా అర్థం చేసుకుంటారు. ద్వితీయోపదేశకాండం 32:4; 1 యోహాను 4:8 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • ఇలాంటి లక్షణాలు ఉన్న దేవుడు చనిపోయినవాళ్లను చిత్రహింసలు పెట్టాలనుకుంటాడా?

  • మరణం గురించి నిజం తెలుసుకోవడం మీకు ఓదార్పుగా అనిపిస్తుందా? ఎందుకు?

కొంతమంది ఇలా అంటారు: “చనిపోయినవాళ్లు నన్ను ఏమైనా చేస్తారేమో అని భయమేస్తుంది.”

  • వాళ్ల భయం పోగొట్టడానికి మీరు ఏ బైబిలు వచనాలు చూపిస్తారు?

ఒక్కమాటలో

చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు. వాళ్లు ఎలాంటి బాధ అనుభవించరు, బ్రతికున్నవాళ్లకు ఏ హానీ చేయలేరు.

మీరేం నేర్చుకున్నారు?

  • చనిపోయాక ఏమౌతుంది?

  • మరణం గురించి నిజం తెలుసుకుంటే మనం ఎలా ప్రయోజనం పొందుతాం?

  • మరణం గురించి నిజం తెలుసుకుంటే మనం ఎలా ఓదార్పు పొందుతాం?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

మనిషి చనిపోయాక అతనిలో ఆత్మ బ్రతికే ఉంటుందని బైబిలు చెప్తుందా?

“ఆత్మ అంటే ఏమిటి?” (jw.org ఆర్టికల్‌)

దేవుడు చెడ్డవాళ్లను నరకంలో వేసి శిక్షిస్తాడో, లేదో తెలుసుకోండి.

చనిపోయినవాళ్లను దేవుడు నరకంలో శిక్షిస్తాడా? (3:07)

చనిపోయాక ఏమౌతుందో తెలుసుకోవడం వల్ల ఒకాయన ఎలా ఓదార్పు పొందాడో చదవండి.

“బైబిలు ఇచ్చే స్పష్టమైన, సరైన జవాబులు నాకు నచ్చాయి” (కావలికోట ఆర్టికల్‌)