కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

18వ పాఠం

నిజ క్రైస్తవుల్ని ఎలా గుర్తుపట్టవచ్చు?

నిజ క్రైస్తవుల్ని ఎలా గుర్తుపట్టవచ్చు?

కోట్లమంది ప్రజలు తాము క్రైస్తవులమని చెప్పుకుంటారు. కానీ వాళ్ల నమ్మకాలు, విలువలు వేర్వేరుగా ఉంటాయి. మరి నిజమైన క్రైస్తవుల్ని ఎలా గుర్తుపట్టవచ్చు?

1. క్రైస్తవులు అంటే ఎవరు?

క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు శిష్యులు లేదా అనుచరులు. (అపొస్తలుల కార్యాలు 11:26 చదవండి.) వాళ్లు నిజంగా యేసు శిష్యులమని ఎలా చూపిస్తారు? ఆయన ఇలా అన్నాడు: “మీరు ఎప్పుడూ నా బోధలు పాటిస్తూ ఉంటే, మీరు నిజంగా నా శిష్యులు.” (యోహాను 8:31) అంటే నిజ క్రైస్తవులు ఎప్పుడూ యేసు బోధల్ని పాటిస్తారు. అంతేకాదు, యేసు లేఖనాల ఆధారంగా బోధించినట్టే, నిజ క్రైస్తవులు కూడా బైబిలు ఆధారంగానే బోధిస్తారు.—లూకా 24:27 చదవండి.

2. నిజ క్రైస్తవులు ఎలా ప్రేమ చూపిస్తారు?

యేసు తన అనుచరులతో ఇలా అన్నాడు: “నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి.” (యోహాను 15:12) తన శిష్యుల్ని ప్రేమిస్తున్నానని యేసు ఎలా చూపించాడు? ఆయన వాళ్లతో సమయం గడిపాడు, వాళ్లను ప్రోత్సహించాడు, వాళ్లకు సహాయం చేశాడు. చివరికి వాళ్లకోసం తన ప్రాణం కూడా పెట్టాడు. (1 యోహాను 3:16) అదేవిధంగా, నిజ క్రైస్తవులు ప్రేమ గురించి బోధించడం కన్నా ఎక్కువే చేస్తారు. వాళ్లు మాటల్లోనే కాదు, చేతల్లో కూడా ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుంటారు.

3. నిజ క్రైస్తవులు ముఖ్యంగా ఏ పని చేస్తారు?

యేసు తన శిష్యులకు ఒక పని అప్పగించాడు, అదేంటంటే ‘దేవుని రాజ్యం గురించి ప్రకటించడం.’ (లూకా 9:2) మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు కేవలం తమ ఆరాధనా స్థలాల్లోనే కాదు బహిరంగ ప్రదేశాలకు, ఇంటింటికి వెళ్లి ప్రకటించారు. (అపొస్తలుల కార్యాలు 5:42; 17:17 చదవండి.) నేడు నిజ క్రైస్తవులు కూడా, ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ బైబిలు సత్యాన్ని ప్రకటిస్తారు. వాళ్లు సాటిమనిషిని ప్రేమిస్తారు కాబట్టి మంచివార్త ప్రకటించడానికి తమ సమయాన్ని, శక్తిని సంతోషంగా ఉపయోగిస్తారు.—మార్కు 12:31.

ఎక్కువ తెలుసుకోండి

యేసు బోధల్ని-ఆదర్శాన్ని పాటించని వాళ్లకు, నిజ క్రైస్తవులకు మధ్య ఉన్న తేడాను పరిశీలించండి.

4. నిజ క్రైస్తవులు బైబిల్లో ఉన్న సత్యాన్ని వెతుకుతారు

మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు దేవుని వాక్యాన్ని ప్రేమించారు

క్రైస్తవులమని చెప్పుకునే చాలామంది బైబిలు సత్యాన్ని పట్టించుకోరు. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • కొన్ని చర్చీలు ఎలా యేసు బోధల్ని ప్రజలకు దూరం చేశాయి?

దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని యేసు బోధించాడు. యోహాను 18:37 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • “సత్యానికి లోబడే” నిజ క్రైస్తవుల్ని ఎలా గుర్తుపట్టవచ్చు అని యేసు చెప్పాడు?

5. వాళ్లు బైబిల్లో ఉన్న సత్యాన్ని ప్రకటిస్తారు

మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఇతరులకు ప్రకటించారు

యేసు పరలోకానికి వెళ్లబోయే ముందు తన అనుచరులకు ఒక పని అప్పగించాడు. అది ఈరోజు వరకు కొనసాగుతూనే ఉంది. మత్తయి 28:19, 20; అపొస్తలుల కార్యాలు 1:8 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • ప్రకటించే పని ఎప్పటివరకు జరుగుతుంది, ఎంత ఎక్కువగా జరుగుతుంది?

6. వాళ్లు ఏం ప్రకటిస్తారో దాన్ని పాటిస్తారు

టామ్‌ అనే ఆయన నిజ క్రైస్తవుల్ని ఎలా గుర్తుపట్టాడు? వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • టామ్‌కు మతం మీద ఎందుకు నమ్మకం పోయింది?

  • నిజ క్రైస్తవులు ఎవరన్నది ఆయన ఎలా గుర్తుపట్టాడు?

మన మాటల కన్నా పనులు ముఖ్యం. మత్తయి 7:21 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • యేసు వేటిని ఎక్కువగా ఇష్టపడతాడు, మనం చెప్పే మాటల్నా లేక మనం చేసే పనుల్నా?

7. వాళ్లు ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుంటారు

మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకున్నారు

క్రైస్తవులు నిజంగా తమ తోటి క్రైస్తవుల్ని ప్రాణం పెట్టేంతగా ప్రేమించారా? వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • తోటి క్రైస్తవుడి కోసం లాయిడ్‌ తన ప్రాణాన్ని ఎందుకు పణంగా పెట్టాడు?

  • ఆయన ఒక నిజ క్రైస్తవుడిలా ప్రవర్తించాడని మీకు అనిపిస్తుందా?

యోహాను 13:34, 35 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • వేరే జాతికి లేదా దేశానికి చెందిన ప్రజల్ని యేసు శిష్యులు (నిజ క్రైస్తవులు) ఎలా చూస్తారు?

  • ఒకవేళ యుద్ధం జరుగుతుంటే, నిజ క్రైస్తవులు ఏం చేస్తారు?

కొంతమంది ఇలా అడుగుతారు: “ఇన్ని చర్చీలు ఉన్నాయి కదా, మరి ఎవరు నిజమైన క్రైస్తవులు?”

  • నిజ క్రైస్తవుల్ని గుర్తుపట్టడానికి మీరు ఏ లేఖనం చూపిస్తారు?

ఒక్కమాటలో

నిజ క్రైస్తవులు బైబిలు చెప్పేవాటిని పాటిస్తారు, తోటి క్రైస్తవుల్ని ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తారు, బైబిల్లో ఉన్న సత్యాన్ని ప్రకటిస్తారు.

మీరేం నేర్చుకున్నారు?

  • నిజ క్రైస్తవులు దేని ఆధారంగా బోధిస్తారు?

  • నిజ క్రైస్తవుల్ని ఏ లక్షణాన్ని బట్టి గుర్తుపట్టవచ్చు?

  • నిజ క్రైస్తవులు ఏ పని చేస్తారు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

యేసు బోధల్ని పాటించడానికి, ఆయనలా ఉండడానికి కృషిచేస్తున్న ఒక గుంపు గురించి తెలుసుకోండి.

యెహోవాసాక్షులు—మేము ఎవరం? (1:13)

ఒకప్పుడు క్యాథలిక్‌ నన్‌గా ఉన్న ఒకామె, నిజ క్రైస్తవుల్ని ఎలా గుర్తుపట్టిందో తెలుసుకోండి.

“నేను అడిగిన ప్రతీ ప్రశ్నకు బైబిలు నుండే జవాబిచ్చారు!” (కావలికోట, జూలై-సెప్టెంబరు 2014)

కష్టాల్లో ఉన్న తోటి క్రైస్తవుల మీద నిజ క్రైస్తవులు ఎలా ప్రేమ చూపిస్తారో తెలుసుకోండి.

విపత్తులు వచ్చినప్పుడు సహోదరులకు సహాయం చేస్తాం—చిన్నభాగం (3:57)

తన అనుచరుల్ని ఎలా గుర్తుపట్టవచ్చో యేసు చెప్పాడు. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు, అలాగే నేటి నిజ క్రైస్తవులు యేసు శిష్యులమని ఎలా నిరూపించుకున్నారో పరిశీలించండి.

“నిజమైన క్రైస్తవుల్ని ఎలా గుర్తుపట్టవచ్చు?” (కావలికోట ఆర్టికల్‌)