కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

13వ పాఠం

మతాలు దేవునికి ఎలా చెడ్డపేరు తెస్తున్నాయి?

మతాలు దేవునికి ఎలా చెడ్డపేరు తెస్తున్నాయి?

దేవుడు ప్రేమ గలవాడు. మరి అలాంటప్పుడు ఆయన్ని ఆరాధిస్తున్నామని చెప్పుకునే మతాలు ఎందుకు చెడ్డ పనులు చేశాయి? ఎందుకంటే అవి నిజమైన మతాలు కావు, అవి దేవునికి చెడ్డపేరు తెచ్చాయి. మతాలు దేవునికి ఎలా చెడ్డపేరు తెచ్చాయో, వాటి గురించి దేవుడు ఏం అనుకుంటున్నాడో, వాటిని ఆయన ఏం చేస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మతాలు చెప్పే అబద్ధ బోధలు దేవునికి ఎలా చెడ్డపేరు తెచ్చాయి?

మతాలు “దేవుని గురించిన సత్యాన్ని కాకుండా అబద్ధాన్ని” నమ్మాయి, ఆ అబద్ధాన్నే బోధించాయి. (రోమీయులు 1:25) ఉదాహరణకు, చాలా మతాలు ప్రజలకు దేవుని పేరును బోధించలేదు. కానీ, దేవుని పేరును తప్పకుండా ఉపయోగించాలని బైబిలు చెప్తుంది. (రోమీయులు 10:13, 14) ఏదైనా చెడు జరిగినప్పుడు దేవుడే అలా రాసిపెట్టాడని కొంతమంది మత బోధకులు అంటారు. కానీ, అది అబద్ధం. ఆయన ఎవ్వరికీ చెడు చేయడు. (యాకోబు 1:13 చదవండి.) బాధాకరమైన విషయం ఏంటంటే, మతాలు బోధిస్తున్న ఇలాంటి అబద్ధాలు ప్రజల్ని దేవునికి దూరం చేశాయి.

2. మతాలు చేసే పనులు దేవునికి ఎలా చెడ్డపేరు తెచ్చాయి?

మతాలు ప్రజల్ని యెహోవా ప్రేమించినట్టుగా ప్రేమించట్లేదు. అవి చేసిన “పాపాలు ఆకాశాన్నంటాయి” అని బైబిలు చెప్తుంది. (ప్రకటన 18:5) వందల సంవత్సరాలుగా మతాలు రాజకీయాల్లో తలదూర్చాయి, యుద్ధాలకు మద్దతిచ్చాయి, లెక్కలేనంత మంది ప్రజల చావుకు ఏదోక విధంగా కారణమయ్యాయి. కొంతమంది మత బోధకులు తాము విలాసంగా బ్రతకడం కోసం, తమ దగ్గరికి వచ్చేవాళ్లను డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చేస్తారు. ఈ పనులన్నీ వాళ్లకు ప్రేమ లేదని, వాళ్లకు అసలు దేవుడు తెలీదని చూపిస్తున్నాయి. కాబట్టి వాళ్లకు దేవుని గురించి బోధించే హక్కు లేదు.—1 యోహాను 4:8 చదవండి.

3. అబద్ధాలు బోధిస్తూ, చెడ్డ పనులు చేస్తున్న మతాల గురించి దేవుడు ఏం అనుకుంటున్నాడు?

మతాలు చేస్తున్న చెడ్డ పనులు చూసి మీకు కోపం వస్తుందా? మరి యెహోవాకు ఎలా అనిపిస్తుంది? ఆయన ప్రజల్ని ప్రేమిస్తాడు, కానీ తన గురించి అబద్ధాలు చెప్తూ, ప్రజలతో చెడుగా ప్రవర్తించే మత బోధకుల్ని అసహ్యించుకుంటాడు. చెడ్డ పనులు చేస్తున్న మతాలన్నీ నాశనమౌతాయని, అవి ‘ఇక ఎప్పటికీ కనిపించవని’ యెహోవా మాటిస్తున్నాడు. (ప్రకటన 18:21) ఆయన మాటిచ్చినట్టే, త్వరలోనే ఆ మతాలన్నిటినీ నాశనం చేస్తాడు.—ప్రకటన 18:8.

ఎక్కువ తెలుసుకోండి

తనకు చెడ్డపేరు తెస్తున్న మతాల గురించి దేవునికి ఇంకా ఎలా అనిపిస్తుందో తెలుసుకోండి. అలాగే ఆ మతాలు ఏం చేశాయో, అవి చేసిన పనుల వల్ల యెహోవా గురించి నేర్చుకోవడం ఎందుకు ఆపేయకూడదో పరిశీలించండి.

4. దేవుడు అన్ని మతాల్నీ ఇష్టపడతాడా?

మతాలన్నీ దేవుని దగ్గరికి నడిపించే వేర్వేరు దారులు అని చాలామంది నమ్ముతారు. కానీ అది నిజమేనా? మత్తయి 7:13, 14 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • జీవానికి నడిపించే దారి గురించి బైబిలు ఏం చెప్తుంది?

వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • దేవుణ్ణి సంతోషపెట్టే మతాలు చాలా ఉన్నాయని బైబిలు చెప్తుందా?

5. మతాలు దేవుడు చూపించినట్టుగా ప్రేమ చూపించట్లేదు

చెడ్డ పనులు చేసే మతాలన్నిటినీ కలిపి అబద్ధ మతం అని పిలవవచ్చు. అబద్ధ మతం ఎన్నో విధాలుగా దేవునికి చెడ్డపేరు తెచ్చింది. అందులో అన్నిటికన్నా దారుణమైనది, యుద్ధాలకు మద్దతివ్వడం. ఉదాహరణకు వీడియో చూడండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చాలా చర్చీలు ఏం చేశాయి?

  • దాని గురించి మీకు ఏమనిపిస్తుంది?

యోహాను 13:34, 35; 17:16 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • మతాలు యుద్ధాలకు మద్దతు ఇచ్చినప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుంది?

  • దేవుడు ప్రేమ చూపించమని చెప్తుంటే, మతాలు ఎన్నో దారుణాలకు కారణమౌతున్నాయి. మతాలు చేసే ఎలాంటి పనుల్ని బట్టి అవి ప్రేమ చూపించట్లేదని మీరు గమనించారు?

అబద్ధ మతం దేవుడు చూపించినట్టుగా ప్రేమ చూపించలేదు

6. అలాంటి మతాల నుండి ప్రజల్ని విడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు

ప్రకటన 18:4 చదవండి, a తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • అబద్ధ మతంలో చిక్కుకుపోయిన వాళ్లను విడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు, అది తెలుసుకున్నప్పుడు మీకెలా అనిపిస్తుంది?

7. నిజమైన దేవుని గురించి నేర్చుకోవడం ఆపకండి

అబద్ధ మతం చెప్పే బోధలకు, అది చేసే పనులకు దేవుణ్ణి నిందించడం సరైనదేనా? ఈ ఉదాహరణ గురించి ఆలోచించండి. ఒకతను వాళ్ల నాన్న మాట వినకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయి, చెడ్డ పనులు చేస్తున్నాడు. అతని పనులు వాళ్ల నాన్నకు ఏమాత్రం నచ్చలేదు, వాటితో ఆయనకు అసలు ఏ సంబంధం లేదు. మరి, అతను చేస్తున్న తప్పుడు పనులకు వాళ్ల నాన్నను నిందించడం సరైనదేనా?

  • అబద్ధ మతం చేసే పనులకు యెహోవాను నిందించడం, ఆయన గురించి నేర్చుకోవడాన్ని ఆపేయడం సరైనదేనా?

కొంతమంది ఇలా అంటారు: “మతాల వల్ల ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి నాకు దేవుడంటే ఇష్టం లేదు.”

  • మీకు కూడా అలాగే అనిపిస్తుందా?

  • అబద్ధ మతం చేసే పనుల వల్ల మనం యెహోవాకు ఎందుకు దూరం అవ్వకూడదు?

ఒక్కమాటలో

అబద్ధ మతం చెప్పే బోధలు, అది చేసే పనులు దేవునికి చెడ్డపేరు తెచ్చాయి. దేవుడు అబద్ధ మతాన్ని నాశనం చేస్తాడు.

మీరేం నేర్చుకున్నారు?

  • అబద్ధ మతం చెప్పే బోధలు విన్నప్పుడు, అది చేసే పనులు చూసినప్పుడు మీకెలా అనిపిస్తుంది?

  • అబద్ధ మతం గురించి యెహోవా ఏం అనుకుంటున్నాడు?

  • అబద్ధ మతాన్ని దేవుడు ఏం చేస్తాడు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

వేర్వేరు మతాల గురించి దేవుడు ఏం అనుకుంటున్నాడో తెలుసుకోండి.

“మతాలన్నీ ఒకటేనా? అన్నీ దేవుని దగ్గరికే నడిపిస్తాయా?” (jw.org ఆర్టికల్‌)

మనం ఇతరులతో కలిసి తనను ఆరాధించాలని యెహోవా ఎందుకు కోరుకుంటున్నాడు?

“ఒక మతంలో సభ్యునిగా ఉండడం నిజంగా అవసరమా?” (jw.org ఆర్టికల్‌)

తన చర్చి బోధలు, పనులు ఒక ప్రీస్టుకు నచ్చలేదు. అతను తన చర్చిని విడిచిపెట్టాడు కానీ దేవుణ్ణి కాదు.

“ఒక ప్రీస్టు తన చర్చిని ఎందుకు విడిచిపెట్టాడు?” (తేజరిల్లు! ఆర్టికల్‌)

వందల సంవత్సరాలుగా, మతాలు చెప్పిన అబద్ధాల వల్ల దేవుడు తమను పట్టించుకోడని, ఆయన క్రూరుడని ప్రజలు అనుకుంటున్నారు. అలాంటి మూడు అబద్ధాల్ని పరిశీలించండి.

“దేవుడు ప్రేమలేని వాడని అనుకునేలా చేసిన అబద్ధాలు” (కావలికోట ఆర్టికల్‌)

a ప్రకటన పుస్తకం అబద్ధ మతాన్ని మహాబబులోను అనే స్త్రీతో ఎందుకు పోలుస్తుందో తెలుసుకోవడానికి, అదనపు సమాచారంలో 1వ పాయింట్‌ చూడండి.